DigitEd
DigitEd

Home

By CivicCentre

APPSC Group-I Exams

22 Aug 2022


80

is there any possibility of Group-I notification in Andhra Pradesh? If yes, how to prepare? What is the way to prepare? What is the syllabus? సంసిద్ధత మరియు సంయమనంతోనే విజయం సాధ్యం

APPSC పరీక్షల ఆశావాహులు 2018 గ్రూప్-1 పరిస్థితి చూసి ఒక రకమైన స్థప్ధత లోకి వెళ్లిపోయారు. వారిలో నిరుత్సాహం అలుముకు పోయింది. కానీ విజయార్ధుడు ఇటువంటి సమయంలోనే వారియొక్క సామర్థ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. పబ్లిక్ సర్విస్ కమిషన్ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు సబ్జెక్టు యందు పట్టు తో పాటు ఓర్పు తో కూడిన పట్టుదల కూడా అవసరం. జరుగుతున్న పరిణామాల దృష్ట్యా వారి ఓపికకి తెర పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. APPSC ఛైర్మన్ గా గౌ! శ్రీ గౌతం సవాంగ్ గారి ఎంపిక, గ్రూప్ 1 ఫలితాల వెల్లడి లో కదలిక మరియు ఎన్నికల వాతావరణం మొదలైన సంధర్భం లో విధ్యార్థుల నిరీక్షణకు తెర పడే అవకాశాలు మెండు గా ఉన్నాయి.

                                                                 APPSC వెల్లడించిన 110-పోస్టులు భర్తీ చేయడానికి సుముఖత చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యార్థి యొక్క అడుగులు ఎలా ఉండాలి ? అనేది ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ప్రశ్న. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు సంసిద్ధత మరియు సంయమనం. ఇప్పటి వరుకు ఆర్ధికంగా కొంచెం ఇబ్బందులున్న నోటిఫికేషన్ కోసం సంయమనంతో ఎదురు చూసిన విద్యార్థులు ఇప్పుడు సంసిద్ధత మీద వారి దృష్టి కేంద్రీకరించాలి. గ్రూప్ 1 పరిధి లో ఉండే సిలబస్ విస్తృతంగా ఉన్నందువల్ల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ మొదలు పెట్టడం అవివేక చర్య.

                                                                 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత APPSC రెండు సార్లు నోటిఫికేషన్ విడుదల చేసింది (2016 & 2018) . 2019 తర్వాత వెల్లడించిన సంస్కరణల దృష్ట్యా ఒక్క గ్రూప్ 1 పరీక్ష మాత్రమే రెండూ అంచెలలో జరుగుతుంది- ప్రిలిమ్స్ మరియు మెయిన్స్.  ప్రిలిమ్స్ పరీక్ష లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క పేపర్ యందు 120 ప్రశ్నలు ఉంటాయి. అందులో చరిత్ర మరియు సంస్కృతి, రాజ్యాంగం, సామాజిక న్యాయం మరియు అంతర్జాతీయ సంబంధాలు, భారత దేశం మరియు ఆంధ్ర ప్రదేశ్ యొక్క ఆర్ధిక వ్యవస్థ మరియు భౌగోళిక శాస్త్రం నుండి చెరో 30 ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 2 యందు 120 ప్రశ్నలు క్రింది అంశాల నుండి ఉంటాయి. అవి సాధారణ మరియు మానసిక సామర్థ్యాలు,    విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికత నుండి చెరో 30 ప్రశ్నలు మరియు కరెంట్ అఫైర్స్ నుండి 60 ప్రశ్నలు ఇవ్వబడును. అందులో నుండి ప్రతి 12 మందికి ఒకరిని ఎంపిక చేసి మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్ష యందు ఐదు(జనరల్ ఎస్సే, భారత దేశ మరియు ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర మరియు సంస్కృతి, భౌగోళిక శాస్త్రం, రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పాలన, చట్టం, మరియు  నీతి శాస్త్రం, భారత దేశ మరియు ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి, విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికత)  మెరిట్ ఆధారిత పేపర్లు మరియు 2 (తెలుగు మరియు ఇంగ్షీషు భాషలు) అర్హత పొందాల్సిన పేపర్లు ఉంటాయి.

                                                                 ఈ సిలబస్ ఇంత విస్తృతంగా ఉన్న నేపధ్యం లో విద్యార్థి నోటిఫికేషన్ తర్వాత తరగతులు మొదలు పెడితే వెనుకపడే అవకాశాలు మెండు గా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పోటీ లో ఇప్పటికే రెండు మూడు సార్లు గ్రూప్ 1 రాసిన వాళ్ళు మరియు ఇప్పుడు గ్రూప్ 2 ఉద్యోగం లో ఉన్న వారు ప్రిపరేషన్ లో నిమగ్నమయ్యి ఉన్నారు. కావున విద్యార్థులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా వారి సామర్థ్యం పెంచుకోవడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇప్పటికే సంసిద్ధులైన విద్యార్థులు టెస్ట్ సిరీస్ తో వారి సామర్థ్యాన్ని పరీక్షించుకొని తప్పులు సరిదిద్దుకోవాలి. ప్రస్తుతం తెలంగాణ నోటిఫికేషన్ ఇచ్చినందున ఆంధ్ర ప్రదేశ్ కూడా అదే కోవలో కొనసాగే అవకాశం లేకపోలేదు. కావున సంశయం వీడి సంయమనం పాటించి సంసిద్ధులు కండి.  మీ సన్నద్ధత కొరకు ఆఫ్ లైన్ క్లాసులు, టెస్ట్ సిరీస్ మరియు మెంటర్ షిప్ వివరాలు www.civiccentre.in వెబ్ సైట్ వీక్షించగలరు.

 వెంకటేశ్ కనకగిరి

భారతదేశ మరియు తెలంగాణ ఆర్ధిక వ్యవస్థ ఫ్యాకల్టీ  


inslin

An ed-tech startup founded by people passionate about transforming lives through education, employment and employability


© 2021. All rights reserved

Follow us on:

inslin
Home